టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గత కొన్ని రోజుల నుండి మీడియాలో ఒక రేంజులో వార్తలు హోరెత్తిపోతున్నాయి. లింగుసామి డైరెక్షన్లో రామ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం "ది వారియర్" షూటింగ్ పూర్తవ్వగానే, తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ మెట్ తో కలిసి రామ్ ఏడడుగులు నడవనున్నాడని ఇన్నాళ్లు టాక్ నడిచింది.
రామ్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన సన్నిహితవర్గాలు తాజాగా పేర్కొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ దృష్టంతా సినిమాల పైనే ఉందని, పెళ్లి చేసుకోవడానికి ఇంకొంత సమయం ఉందని, ఈ లోపు పెళ్లి చేసుకుంటే తప్పకుండా అధికారికంగా ప్రకటిస్తారని రామ్ క్లోజ్ సర్కిల్స్ సమాచారం. దీంతో మీడియాలో రామ్ పెళ్లిపై వస్తున్న వార్తలు ఒత్తి పుకార్లే అని స్పష్టమవుతుంది.