ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోయపాటి - రామ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో "డాన్"?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 03:09 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో "ది వారియర్" సినిమా రూపొదిద్దుకుంటుంది. ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ మూవీ విడుదలైన వెంటనే, టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ బోయపాటి శీనుతో రామ్ తదుపరి సినిమాను చేయనున్నాడు. వీరి కాంబోలో రూపొందే సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ప్రచారం జరుగుతుంది. ఐతే, దీనిపై మూవీ టీం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఇదిలావుండగా, తాజాగా ఈ సినిమాపై మరొక ఇంటరెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అదేంటంటే, పాన్ ఇండియా లెవెల్లో వంద కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావలసి ఉంది.
వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు శివకార్తికేయన్ సుపరిచితుడే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com