ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పక్కా కమర్షియల్ డిజిటల్ పార్టనర్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 04:20 PM

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. మారుతి డైరెక్షన్లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా కథానాయికగా నటిస్తుంది. పలు వాయిదాల తర్వాత జూలై 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పక్కా కమర్షియల్ మూవీ మేకర్స్ ఓటిటి పార్టనర్ ను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ ఓటిటి దిగ్గజమైన నెట్ ఫ్లిక్స్, తెలుగు ఓటిటి ఆహా లలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవనున్నట్టు టాక్. థియేటర్లలో విడుదలైన ఐదు వారాలకు ఓటిటిలో డిజిటల్ స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com