ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోరుగా RC15 మ్యూజిక్ సిట్టింగ్స్... తమన్ ట్విట్టర్ పోస్ట్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:19 PM

ఆర్ ఆర్ ఆర్ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే కదా. రామ్ చరణ్ కెరీర్లో ఇది 15 వ చిత్రం కాబట్టి RC15 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. 
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ లోని విభిన్న ప్రాంతాలలో పలు షెడ్యూల్స్ జరుపుకుంది. తాజాగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. RC15 మ్యూజిక్ సిట్టింగ్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని, తనకు ఎంతో ఇష్టమైన శంకర్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారని, చరణ్ తో కొంత గ్యాప్ తరువాత చేస్తున్న ఈ మూవీ కోసం RC15 టీం హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ కు మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో శంకర్ తో కలిసి ఏదో విషయం గురించి తీవ్రంగా డిస్కస్ చేస్తున్న ఫోటోను జత చేసాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com