టాలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ కుమార్ ఏకైక పుత్రుడు అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఏనుగు. ఈ సినిమాకు సూర్యతో "సింగం" సినిమాలను తెరకెక్కించిన హరి దర్శకత్వం వహించగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తమిళ, తెలుగు భాషలలో సి హెచ్ సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ నిన్ననే హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. షెడ్యూల్ ప్రకారం, జూన్ 17న థియేటర్లలో విడుదల కావలసిన ఈ సినిమాను కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదావేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా తెలిపింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సముద్రఖని, యోగిబాబు, కేజీఎఫ్ రామచంద్రరాజు తదితరులు కీలక పాత్రలను పోషించారు.