అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పేట్రియాటిక్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని AK ఎంటెర్టైన్మెంట్స్, సురేందర్ టు సినిమాస్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటించనున్నారు. క్యూట్ లుక్స్ తో, లవర్ బాయ్ లా ఉండే అఖిల్ ఈ సినిమాలో తన లుక్ ను పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తుంది. కండలు తిరిగిన దేహంతో, పొడవాటి జుట్టుతో ఫుల్ రఫ్ లుక్లో కనిపిస్తున్నాడు.
హైదరాబాద్, వైజాగ్ లలో షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఏజెంట్ చిత్రబృందం ప్రస్తుతం మనాలిలో షూటింగ్ చేస్తుంది. రిస్కీ ఫైట్స్ ను, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ను మనాలి లో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అఖిల్, సురేందర్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, స్టంట్ డైరెక్టర్ విజయ్ మాస్టర్ లు కలిసి మనాలి లో ఒక ఇంటిపై నిల్చుని దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిప్ -హప్ తమిళ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది.