ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RAPO 20' ఈ తేదీన లాంచ్ కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 02:55 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. తాజా అప్డేట్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించడానికి తేదీని లాక్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం జూన్‌ 1న ప్రారంభం కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు, రామ్ ఎన్. లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్'లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, కృతి శెట్టి, అక్షర గౌడ, నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com