లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తాజా అప్డేట్ ప్రకారం, కమల్ హాసన్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ స్టార్ హీరో తమిళంతో పాటు తెలుగుకి తానే డబ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విక్రమ్ సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.