సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదలయ్యాక ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.