ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USAలో సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ ని బీట్ చేసిన 'సర్కారు వారి పాట'

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:02 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, సర్కారు వారి పాట సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద ఆదివారం నాడు 155 లొకేషన్ల నుండి $26,573 వసూలు చేసింది. దీంతో ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ 2,291,728 డాలర్లు రాబటింది. అంతేకాకుండా, ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు $2,288,613 కలెక్షన్లను క్రాస్ చేసింది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com