టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు అని లేటెస్ట్ టాక్. ఇంటర్వెల్లో నవీన్ పోలిశెట్టి కనిపించనున్నాడని, ఈ సినిమాలో నవీన్ రోల్ ఫుల్ కామెడీ రోల్ లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసాక ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమవుతుంది అని సమాచారం. ప్రస్తుతం బాలకృష్,ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK107' సినిమాతో బిజీగా ఉన్నారు.