ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విడుదల కానున్న నయనతార 'O2' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 12:37 PM

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఇటీవల విడుదలైన 'కాతువాకుల రెండు కాదల్' మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లేడీ సూపర్ స్టార్ తదుపరి సినిమా 'O2' ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. GS విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తన ప్లాట్‌ఫారమ్‌లో డైరెక్ట్ గా విడుదల కానుంది అని ప్రకటించింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రిత్విక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ OTT సినిమా  తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com