టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం కాశ్మీర్ లో ఉంది. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఒక అందమైన ప్రేమకథలో, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత లీడ్ పెయిర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం మంచు ప్రాంతాల్లోనే జరగనుందని టాక్. ఇటీవలనే హైదరాబాద్ లో పూజా కార్యక్రమం తో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. గత రెండువారాలనుండి చిత్రబృందం మొత్తం కాశ్మీర్లో, మంచు ప్రదేశాలలో షూట్ చేస్తూ చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సమంత బర్త్ డే, విజయ్ బర్త్ డేలను చిత్రబృందం చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది.
సాధారణంగానే సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సమంత ఈ మూవీ షూట్ స్టార్ట్ అయినప్పటి నుండి కాశ్మీర్ అందాలను మొబైల్ లో బంధించి తన సోషల్ మీడియా ఖాతాలలో అదేపనిగా షేర్ చేస్తుంది. అంతేకాకుండా, షూట్ గ్యాప్ లో తాను చదువుతున్న పుస్తకాల పేజీలను కూడా ఫోటో తీసి పోస్ట్ చేస్తుంది. సమంత కొత్తగా చదవడం ప్రారంభించిన ది అన్ టీథర్డ్ సోల్ అనే పుస్తకంలోని పేజీలను తన ఇంస్టాగ్రామ్ స్టోరీ గా షేర్ చేసింది. ఏమైనా, ఇక్కడ ఎండలు మండిపోతుంటే, సమంత మాత్రం కాశ్మీర్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించటంతో కొంతమంది అభిమానులు అసూయ పడుతున్నారు. తాముకూడా సమంతలాగానే ఏదైనా మంచుప్రాంతాలకు వెళ్లి ఈ వేసవిని తప్పించుకోవాలని కోరుకుంటున్నారు. మరికొంతమందేమో, ఖాళీ సమయాన్ని కూడా సమంత ఎంత నేర్పుగా ఉపయోగించుకుంటుంది! అంటూ మెచ్చుకుంటున్నారు. ఆమెలాగానే ఈ వేసవిలో కొత్త బుక్స్ ను చదవాలని ప్లాన్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు.