ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున' ఫస్ట్ లుక్‌ పోస్టర్ ని విడుదల చేసిన స్టార్ ప్రొడ్యూసర్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 11:56 AM

టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో గ్లామర్ తోనే కాకుండా తన నటనతో అందరి హృదయాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించింది. పా కిన్స్లిన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి 'డ్రైవర్ జమున' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'డ్రైవర్ జమున' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ఐశ్వర్య రాజేష్ ఉగ్ర అవతార్‌లో కనిపిస్తుంది. మహిళా క్యాబ్ డ్రైవర్ రోజున జరిగే సంఘటనల చుట్టూ ఈ సినిమా వెళ్తుంది అని సమాచారం. 18 రీల్స్‌పై ఎస్.పి.చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com