ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ తన 91వ సినిమాని లలిత్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'శేఖర్' అనే టైటిల్ మూవీ మేకర్స్ ఖరారు చేసారు. 'ది మ్యాన్ విత్ ది స్కార్' అనే క్యాప్షన్‌ను మేకర్స్ ఈ మూవీకి ఫిక్స్ చేసారు. ఈ సినిమా మే 20, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మలయాళ థ్రిల్లర్ జోసెఫ్ సినిమా అధికారిక రీమేక్. ఈ సినిమాలో అను సితార అండ్ ముస్కాన్ ఖుబ్‌చందానీ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో రాజశేఖర్ ట్రైలర్ లో చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. అనుబ్ రూబెన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ చిత్రంలో శివాని రాజశేఖర్, ప్రకాష్ రాజ్, ముస్కాన్ కుబ్చంధాని, ఆత్మీయ రాజన్, అభినవ్ గోమతం, సమీర్, భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య ప్రొడక్షన్స్ అండ్ పెగాసస్ సినీ కార్ప్పై MLV సత్యనారాయణ, శివాని, శివాత్మిక అండ్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.