ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పుష్ప-2' స్క్రిప్ట్‌లో మార్పులపై నిర్మాత క్లారిటీ!

cinema |  Suryaa Desk  | Published : Tue, May 03, 2022, 12:03 PM

'కేజీఎఫ్​-2' సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఇప్పుడు ఆ సినిమా ప్రభావం 'పుష్ప-2'పై పడొచ్చని వార్తలు వచ్చాయి. దీంతో పుష్ప సినిమా పార్ట్-2 స్క్రిప్ట్​లో డైరెక్టర్ సుకుమార్​ మార్పులు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయంపై సినిమా నిర్మాత వై రవిశంకర్​ స్పందించారు. స్క్రిప్ట్​లో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. 'కేజీఎఫ్​-2' ప్రభావం 'పుష్ప-2' పై ప్రభావం చూపించదని అన్నారు. ఇప్పటికే తమ దగ్గర పార్ట్-2 కోసం హైఓల్టేజ్‌ స్క్రిప్ట్‌ రెడీగా ఉందని చెప్పారు. లొకేషన్ల కోసం కొన్ని రోజులుగా తిరుగుతున్నామని అన్నారు.

పుష్ప పార్ట్-1 షూటింగ్ జరిగిన అడవిలోనే పార్ట్-2 ని కూడా తెరకెక్కిస్తామని రవిశంకర్‌ చెప్పారు. పార్ట్-1 లో పుష్పరాజ్‌ అనే సాధారణ కూలీ ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది చూపించారు. అయితే పార్ట్-2 లో ఏమేం చూపించబోతున్నారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com