ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని పొగడ్తలతో తడిసి ముద్దయిన బాలీవుడ్ స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 03:45 PM

నాచురల్ స్టార్ నాని నటించిన స్పోర్ట్స్ బేస్డ్ మూవీ జెర్సీ. 2019లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. హిందీ లో ఈ సినిమాని స్టార్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు జెర్సీకి దర్శకత్వం చేసిన గౌతమ్ తిన్ననూరి నే హిందీలో కూడా డైరెక్షన్ చేపట్టారు. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినప్పటికీ కరోనా మరియు ఇతరత్రా కారణాల వల్ల పలు మార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా ఏప్రిల్ 22 అంటే ఈ రోజు విడుదలైంది. తొలి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం. 


తాజాగా ఈ సినిమాను చూసిన నాని చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. గౌతమ్ తిన్ననూరి మరోసారి అదరగొట్టేసాడని, షాహిద్, మృణాల్ తో పాటు మిగిలిన నటీనటులు అద్భుతంగా నటించారని, ఇది ఒక మంచి సినిమా... అని నాని ట్వీట్ చేసారు. దీనికి షాహిద్ కపూర్ ఎంతో సంతోషంతో తన స్పందనను తెలియజేసారు. నానిని స్నేహితుడిగా అభివర్ణిస్తూ తన పెద్ద మనసు ఈ సినిమాలో కనిపిస్తుందని పేర్కొంటూ కృతజ్ఞతలను తెలియజేస్తూ రీట్వీట్ చేసాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com