కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది.. చైనాలో పుట్టి 115 దేశాల్లో విస్తరించిన ఈ మాయదారి రోగం.. ఎప్పుడు ఎవరిని ఎటాక్ చేస్తోందో తెలియని పరిస్థితి.. ప్రభుత్వాలు కూడా సీరియస్‌గా తీసుకుని ఈ వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఇదే సమయంలో పోర్న్ చూసేవాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పింది పోర్న్ హబ్ సైట్... ఇటలీలోని వారు పోర్న్‌హబ్ సైట్ ప్రీమియమ్ కంటెంట్‌ను ఈ నెలమొత్తం ఫ్రీగా చూడొచ్చని ప్రకటించింది. మరోవైపు తన ఉదారతను కూడా చాటుకుంది 'పోర్న్‌హబ్'. తమ అనుబంధ సైట్ అయిన 'మోడల్ హబ్‌కు మార్చి నెలలో వచ్చే ఆదాయాన్ని కరోనా బాధితుల సహాయం కోసం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఏదేమైనా కరోనా వైరస్ మాత్రం ఇప్పుడు పోర్న్ హబ్ చూసేవారికి పండగ చేసుకునే ఆఫర్ తెచ్చింది... అయితే, ఈ బంపరాఫర్ కేవలం ఇటలీ వరకే పరిమితం. ఇక, పోర్న్‌హబ్‌ను ప్రపంచవ్యాప్తంగా చందాదారులున్నారు.. ఈ సైట్ వీస్తున్న టాప్ 20 దేశాల్లో ఇటలీ 7వ స్థానంలో ఉందని గతంలో ఓ సర్వే ప్రకటించింది.