అమేథీ :కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గంలో జరిపిన పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ అమేథీ పర్యటన సందర్భంగా వెలసిన పోస్టర్లకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాహుల్ ను రాముడిగా, ప్రధాని మోడీని రావణుడిగా చిత్రిస్తూ అమేథీలో కాంగ్రెస్ పోస్టర్లు వెలసిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ ఫర్యటన సందర్భంగా రాహుల్ గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు ఆయన కాన్వాయ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.