ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాల్లో జగన్‌ గాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 01:20 AM

 -టీడీనీ ఎమ్మెల్యేల  పని తీరుతో స్థానికుల్లో నిరుత్సాహం
 -కార్యకర్తల కంటే విదేశీ సంస్థలకు మేలు ఎక్కువ
 -ప్రభుత్వ పనుల్లో ప్రతిపక్షంతో సమన్వయ లేమి
 -ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్‌‌సమెంట్‌ పథƒకాలపై అసంతృప్తి

విజయవాడ, మేజర్‌న్యూస్‌:  రాష్ర్ట విభజన నేపధ్యంలో ప్రజలు ఆంధ్ర ప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబుకు పట్టం కట్టారు. మూడు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంపై పట్టణ ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మా్త్రం జగన్‌ గాలి గట్టిగా వీస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ అంశమే వైసిపీలోకి నేతలు వలసలు వచ్చేలా చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ర్ట విభజన ,కాంగ్రెస్‌పై  ప్రజలు అసహనం, పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం అన్ని కలసి నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు పీఠం దక్కించుకున్నారు. దానికి తగ్గట్టు సీఎం చంద్రబాబు  ప్రమాణ స్వీకారం కుడా ప్రధానంగా ఐదు అంశాలతో జరిగింది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు, రైతు రుణ మాఫీ, డ్వాక్రా  రుణమాఫీ, అమరావతి నిర్మాణం వంటి అంశాల విషయం ప్రజలు సుదీర్ఘ విశ్వాసం చంద్రబాబుపై ప్రజలకు కలిగింది. కానీ మూడు సంవత్సరాలు గడిచిన రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, ఆరోగ్య శ్రీ , ఎన్టీఆర్‌  వైద్య సేవలు అసలు ప్రజల్లోకి వెళ్ళకపోవడం గమనార్హం. బాబు కష్టపడినా కొత్త శాసన సభ్యులు ప్రజా పనుల్లో జాప్యం చేయడం గ్రామీణ ప్రాంతంలో బాబు పాలనపై మరింత వ్యతిరేకత తీసుకొచ్చాయి. ఈ విషయం టీడీపీ శ్రేణులకు తెలిసి తెలుగు తమ్ముళ్లకు శిక్షణ పేరిట మూడు రోజులు క్లాస్‌లు చూపిన వైఖరిలో మార్పు లేదని గుసగుసలు బాగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశమే ప్రతిపక్ష వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారింది. తెలుగుదేశానికి అధిక స్థానాలు ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా  వైసీపీలో కోటగిరి విద్య ధరరావు కుమారుడు వైసీపీ చేరిక సభతో సీన్‌ మారింది. అక్కడ మొదలు పెట్టి కర్నూల్‌లో భూమా వర్గానికి వ్యతిరేక వర్గమైన గంగుల ప్రభాకర్‌రెడ్డి  వైసీపీలో చేరడంతో మరో మెట్టు వైసీపీకి పెరిగింది. ఇక తెలుగుదేశంలో వ్యవసాయ రంగ నిపుణుడు మాజీ మంత్రి వద్దే శోభనాద్రిశ్వరావు వైసీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడిగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా పేరున్న లగడపాటి రాజగోపాల్‌ కుడా ఈ మధ్య వచ్చే ఎన్నికలో జగన్‌కు అనుకూలమైన పరిస్థితి ఉందని చెప్పి అయ్యన కూడా జగన్‌ వైపు నడుస్తున్న సంకేత ఇచ్చారు. ఎయిర్‌పోర్‌‌టలో రోజా అరెస్‌‌ట వ్యవహారంలో కాంగ్రెస్‌ , వైసీపీలు చాలా వరకు దగ్గర అవడానికి దోహద పడిన నేపధ్యంలో చాల చోట్ల కాంగ్రెస్‌ శ్రేణులు వైసీపీకి పూర్తీ మద్దతు ఇస్తున్నాయి. వీటి అన్నిటి కంటే స్పెషల్‌ స్టేటస్‌ ఫై విశాఖలో జగన్‌ పోరాట స్ఫూర్తి ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా జగన్‌ను యువతకు దగ్గర చేసినట్లు అంచనా. చంద్ర బాబు ఇప్పడు ఉన్న పధకాలు కన్నా వైఎస్‌ పెట్టిన పధకాలు అమలు చేయక పోవడం వల్ల ఎక్కువ ప్రజా వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం.  ఫీజు రీయింబర్‌‌సమెంట్‌, ఆరోగ్య శ్రీ అమలులో జాప్యం వంటివి గ్రామీణ ప్రాంతంలో ప్రభావం చూపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ వచ్చిన కొని చోట్ల మినహాయించి రాష్ర్ట  వ్యాప్తంగా ప్రభావం వైసీపీ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com