అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రయ పరిశీలన, పర్యవేక్షణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎన్నికల సంఘం అహ్మదాబాద్ లో వెబ్ క్యాస్టింగ్ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 37 ఓట్ల లెక్కింపు కేంద్రాలలో మొత్తం 1251 కెమేరాలను ఏర్పాటు చేసి వెబ్ క్యాస్టింగ్ కంట్రోల్ రూం ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నది.