ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణాచల్‌ప్రదేశ్‌లోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2017, 11:39 AM

ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా అసభ్యపదజాలాన్ని రాశారన్న ఆరోపణలతో తరగతి గదిలో విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన ఘటన అరుణాచల్‌ప్రదేశ్‌లోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో చోటుచేసుకుంది. పపౌమ్‌పరే జిల్లా తనీ హప్పా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయలో ఆరు, ఏడు తరగతులకు చెందిన 88 మంది విద్యార్థినులను ఆ పాఠశాల ఉపాధ్యాయులు నవంబరు 23న నగ్నంగా నిలబెట్టి శిక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థినులు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో నవంబరు 27 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఓ విద్యార్థిని అసభ్యపదజాలం రాసిందని, ఆ పేపరు చూపించాలని ఆరోపిస్తూ ఇద్దరు సహాయ టీచర్లు, ఓ జూనియర్ టీచర్ 88 మంది బాలికలను వివస్త్రలుగా చేసి నిలబెట్టారు. కాగితం ముక్కకోసం తమను బట్టలూడదీసిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పవద్దని బెదిరించారని విద్యార్థినులు పేర్కొన్నారు.


ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు బాధిత విద్యార్థినులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు, వారిని విచారించారు. ఈ ఘటన జరిగినట్లు నిర్థరించిన తర్వాత కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో దారుణమైన పాలనకు ఇలాంటి ఘటనలు నిదర్శనమని ఆరోపించింది. ఒక విద్యార్థిని క్రమశిక్షణలో ఉంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అయినా, ఇలా వివస్త్రలను చేసి నిలబెట్టడం సమంజసం కాదని, ఇది బాలహక్కులను హరించడమేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. హెడ్‌మాస్టర్‌పై అసభ్యరాతలు రాసిన వాళ్లు ఎవరో చెప్పాలని వారిని అడిగామని, అయినా సరే చెప్పకపోతే బట్టలువిప్పించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఘటన జరగకముందు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడలేదని ఏపీపీడీఎస్‌యూ అధ్యక్షుడు నబమ్ టాడో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com