బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ రాజకీయాల్లోకి వచ్చారు. దిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ‘ఇది చాలా ముఖ్యమైన రోజు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా దేశాన్ని అభివృద్ధివైపు నడిపిస్తున్నారు. అంతేగాక.. ప్రపంచదేశాలు భారత్‌ను చూసే దృష్టిని కూడా మారుస్తున్నారు’ అని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. నిర్మాతగా, మోడల్‌గా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టిన రాహుల్ రాయ్.. 1990లో విడుదలైన ఆషికీ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు సాధించారు.