ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మకు మాటిచ్చా.. బైక్ నడపను: యువీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 28, 2017, 01:14 PM

మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే యువరాజ్ సింగ్‌కు అమ్మ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. క్రికెటర్‌గా దూకుడుగా వ్యవహరించే యువీ.. అమ్మ దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతాడు. ఒంటి చేత్తో జట్టుకు వరల్డ్ కప్ అందించిన ఈ ఆల్‌రౌండర్‌కు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. ధోనీ తరహాలోనే బైక్ మీద దూసుకెళ్లేందుకు ఇష్టపడేవాడు. కానీ అమ్మకు ఇచ్చిన మాట కోసం బైక్ నడపడం లేదని చెప్పాడు.బైక్ నడపడం అంటే నాకెంతో ఇష్టం. కానీ నాకో అమ్మ ఎంతగానో ఆలోచిస్తుంది. అందుకే ఏ రోజైతే నువ్వు బైక్ రైడ్ చేస్తావో.. అదే రోజు నేను నీ దగ్గర్నుంచి వెళ్లిపోతా అని చెప్పింది. బైక్ నడపొద్దని నా దగ్గర మాట తీసుకుందని యువీ ఇటీవల వెల్లడించాడు.దీంతో యువీ బైక్‌ బదులు కార్లు వాడటం మొదలుపెట్టాడు. ‘నేను కార్లు నడపటాన్ని ఇష్టపడతా. నా దగ్గర మెర్సిడిస్, ఆడి, బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదినప్పుడు రెండు కార్లు బహుమతిగా వచ్చాయి. అమ్మకు మెర్సిడెస్ ఉంది. అదంటే నాకెంతో ఇష్టమ’ని యువీ చెప్పాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com