ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ దర్శకుడి కుమారుడు ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 03:31 PM

బాలీవుడ్ దర్శకనిర్మాత గిరీష్ మాలిక్ కుమారుడు మన్నన్‌(17) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని ఒబెరాయ్ స్ప్రింగ్స్‌లో ఉన్న తమ భవనం 5వ అంతస్తు నుండి మార్చి 18న కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే క్షతగాత్రుడిని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు. మన్నన్ ఇటీవల కాలంలో తాగుడుకు బానిసయ్యాడు. అతడిని తండ్రి తాగుడు మానేయమని చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై అంబోలి పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బండోపంత్ బన్సోడే కేసు వివరాలను వెల్లడించారు. మన్నన్ హోలీ ఆడి, బాగా తాగి ఇంటికి వచ్చాడన్నారు. ఇంట్లో కూడా తాగుతూ కనిపించడంతో తల్లి నిలదీసిందన్నారు. అతని తండ్రి అతడిని మందలించినట్లు పేర్కొన్నారు. కోపంతో తన గదిలోకి వెళ్లి మన్నన్ తలుపేసుకున్నాడన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎవరి పనుల్లో వారు ఉండగా భవనం నుంచి కిందికి దూకాడని తెలిపారు. ఆయన తండ్రి గిరీష్ మాలిక్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. సంజయ్ దత్ నటించి టోర్బాజ్ మాన్ Vs ఖాన్, జల్ వంటి చిత్రాలనె తెరకెక్కించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com