ఉక్రెయిన్ -రష్యాల మధ్య భీకరపోరు కొనసాగుతున్న వేళ..యుద్ధంపై హాలీవుడ్ దిగ్గజ నటుడు అర్నాల్డ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని. 141 దేశాలు ఖండించాయన్న ఆయన..ఉక్రెయిన్ పై దాడులను వెంటనే ఆపేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరారు. అమాయక ప్రజలపై. రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తోందన్న బాలీవుడ్ నటుడు. ఈ దాడులతో ఎన్నో పౌర భవనాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. అటు ఇరుదేశాల ఉద్రిక్తతలతో..వేలాది మంది సైనికులు అసువులు బాసినట్లు అర్నాల్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా సేనలు జరిపిన దాడిలో ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ ప్రాణాలు కోల్పోయారు. కీవ్ లోని ఓ నివాస భవనంపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో ఆమె మరణించినట్లు ఉక్రెయిన్ మీడియా పేర్కొంది.