చంద్రబాబునుసీఎం ను చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించడం ఎందుకని.. టీడీపీ లో చేరితే సరిపోతుందని మంత్రి కొడాలి నాని అన్నారు. 'ఏపీ లో జగన్‌ను ఢీకొట్టే మగాడు లేడు. 160 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేసే పార్టీ ఏదీ లేదు. ఏ పార్టీ అయినా సింగిల్‌గా పోటీ చేసి గెలిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేసే సత్తా జగన్‌కే ఉంది. జగన్ ఉన్నంతవరకు సీఎం సీటును టచ్ చేసేవారెవరూ లేరు' అని అన్నారు.