చలికాలంలోనే కాకుండా సీజన్ మారినప్పుడల్లా ఆస్తమా ఇబ్బంది పెడుతుంది. గాలిని ఊపిరితిత్తులకు మోసుకెళ్లే నాళాలు వాచి ఉబ్బడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది పిల్లలు, యువత మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. మరి దీనిని ఎదుర్కోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- గాలిలో తేమ శాతం తగ్గినప్పుడు ఉబ్బసం తలెత్తుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఎయిర్ కండీషర్ను వాడుతూ ఉండాలి.
- ఉదయం చలిగాలిలో వెళ్లేప్పుడు మాస్క్, క్యాప్ వాడాలి.
- మంచి పోషక ఆహారం, వ్యాయామం చేస్తూ ఉండాలి.
- క్రమం తప్పకుండా పల్మనరీ ఫంక్షన్ టెస్టు చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆస్తమా స్థాయిలను అంచనా వేస్తూ తగిన మందులు వేసుకోవచ్చు.
- వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్వెటర్స్ వాడాలి. చెవులు కప్పుకోవడం వల్ల ఆస్తమా నుంచి రక్షించుకోవచ్చు.
- వంట చేసేప్పుడు వచ్చే పొగ, స్విమ్మింగ్ ఫూల్లో వచ్చే బలమైన క్లోరిన్ వాసనలు ఆస్తమాను పెంచుతాయని గుర్తుంచుకోవాలి.
- కాలుష్యం, పొగ తాగడం వల్ల కూడా ఆస్తమా ఏర్పడే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.