ఉత్తర కొరియా త్వరలో అణు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అంచనావేస్తోంది. ఉత్తర కొరియాలో చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి లభించిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు అమెరికాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ) వెల్లడించింది. ఉత్తర కొరియా ప్రయత్నాలు ప్రపంచానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. డీఎన్ఐ అంచనా ప్రకారం.. ఉత్తర కొరియాలోని యోంగ్బియాన్ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అణు పరీక్షలు జరిపేందుకే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని అమెరికా అంచనా.