ఉక్రెయిన్పై రష్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. బుల్లెట్లు, బాంబులతో నగరాలను శిథిలాలుగా మారుస్తోంది. అయితే రష్యా సైన్యం దాడులను ఉక్రెయిన్ బలంగానే తిప్పి కొడుతోంది. ఉక్రెయిన్ సైన్యమే కాకుండా పౌరులు కూడా రష్యా సైనికులను ప్రతిఘటిస్తున్నారు. తమ దేశంలో మీకేం పనని, వెంటనే ఇక్కడికి వెళ్లిపోవాలంటూ ఎదురు పడి నిలదీస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి రష్యా యుద్ధ ట్యాంక్ పైకి ఎక్కి ఉక్రెయిన్ జెండాను ఎగురవేశాడు. చుట్టూ జనాలు చప్పట్లు కొడుతుండగా యుద్ధ ట్యాంకుపై ఉక్రెయిన్ జెండాను రెపరెపలాడిస్తూ నినాదాలు చేశాడు.