సోచి: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శునకాలంటే విపరీతమైన ప్రేమ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ఆయన 65వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తుర్కెమెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బాంగ్లీ బెర్డిముహమొదేవ్ పుతిన్‌కు ఓ ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. ఓ బుజ్జి కుక్కపిల్లను పుతిన్‌కు గుర్బాంగ్లీ బహుమతిగా ఇచ్చారు. దాన్ని అందుకున్న పుతిన్ శునకం తలపై ప్రేమగా నిమురుతూ, ముద్దాడుతున్న ఫొటోను రష్యా ప్రభుత్వం ట్విటర్ ద్వారా విడుదల చేసింది. పుతిన్‌కు శునకంతో పాటు చేతితో తయారుచేసిన కార్పెట్స్‌ను కూడా ఆయన కానుకగా ఇచ్చారు.