ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుక్క పిల్లను బలిచ్చి రక్తం తాగిన చిన్నారులు..!

national |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 04:22 PM

దేశంలో అన్ని రాష్ట్రాల్లో జంతు బలుల కల్చర్ ఉన్నప్పటికీ, ఒరిస్సాలో ఇంకొంచెం ఎక్కువ. అక్కడ పిల్లలపై కూడా వీటి ప్రభావం పడింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. పెట్ డాగ్స్‌తో ఆడుకోవాల్సిన వయస్సున్న ఐదుగురు పిల్లలు.. ఓ కుక్క పిల్లను బలివ్వడం సంచలనం రేపింది. బొలన్​గిర్​ జిల్లా పండారపిటా గ్రామంలో.. స్థానికంగా నిర్వహించే సులియా జాతరకు జంతుబలులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఆ గ్రామానికి చెందిన ఐదుగురు పిల్లలపై ఈ కల్చర్ దుష్ప్రభావం చూపింది. ఈ అంధవిశ్వాసానికి అట్రాక్ట్ అయిన ఆ చిన్నారులు ఓ కుక్కపిల్లను ఊరేగించి, పూజలు నిర్వహించి దానిని అత్యంత దారుణంగా చంపేశారు. ఆ తర్వాత పాశవికంగా దాని రక్తాన్ని తాగారు. ఇది గమనించిన పలువురు గ్రామస్థులు పిల్లలను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. రేబిస్​ వ్యాక్సిన్​ ఇచ్చిన డాక్టర్లు.. ప్రజంట్ పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com