ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అండర్ గ్రౌండ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

international |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 12:16 PM

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగిస్తోంది. దీంతో ఆ దేశంలో ఎక్కడ చూసిన బాంబుల మోత వినిపిస్తోంది. ప్రజలంతా అండర్ గ్రౌండ్‌, బంకర్లు, మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో గత రాత్రి అండర్ గ్రౌండ్ నుంచి ఓ మహిళ అరుపులను ఉక్రెయిన్ పోలీసులు విన్నారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుసుకుని అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని డెమోక్రసీ ఇన్ యాక్షన్ కాన్ఫరెన్స్ అధ్యక్షురాలు హన్నా హాప్కో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ చిన్నారికి హోప్(HOPE) అనే పేరు పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. పలువురు నెటిజన్లు ఆ చిన్నారిని ఉక్రెయిన్ ఆశాకిరణమని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com