ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి కారణమిదే

international |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 03:38 PM

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు ఈ దేశాలకు యుద్దం రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. రష్యా నుంచి ఉక్రెయిన్ విడిపోయింది. అప్పటి నుంచి ఉక్రెయిన్ స్వతంత్య్ర దేశంగా ఉంటుంది. ఉక్రెయిన్ ను నాటోలో (సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి) చేర్చుకునేందుకు అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు సిద్దంగా ఉన్నాయి. దానికి మద్దతు కూడా పలికాయి. ఉక్రెయిన్ నాటోలో చేరవద్దని రష్యా ప్రధాన డిమాండ్. తమ నుంచి విడిపోయిన దేశమైన ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకొని, తద్వారా పశ్చిమ దేశాలు రష్యాను చుట్టుముడతాయని రష్యా వాదన. రష్యాను దెబ్బతిసేందుకే ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకుంటున్నారని రష్యా ఆరోపిస్తుంది. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ కూడా సిద్దమైంది. నాటోలో చేరితే సహించమని, ఉక్రెయిన్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు ప్రకటించాడు. దీని పై ఉక్రెయిన్ వెనక్కి తగ్గలేదు. అలా కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం ముదిరింది. చివరికి యుద్దానికి దారి తీసింది.


ఎనిమిదేళ్ల క్రితం క్రిమియాను ఏ విధంగా స్వాధీనం చేసుకుందో ఇప్పుడు ఉక్రెయిన్‌ కూడా స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. యూరోపియన్ భూభాగంలో రష్యా తన ప్రాబల్యం పెంచుకోవడం, అలాగే నల్ల సముద్రం, అదే విధంగా చమురుపై ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు రష్యా ఈ చర్యలకు పూనుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com