ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం చంద్రబాబు కృషి ఫలితమే రాష్ట్రానికి పెట్టుబడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 12:30 AM

  రాష్ర్టంలో పెటుబడులను ఆహ్వానించేందుకు భేటీలు 


  అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా  నిర్మించేందుకు సన్నాహాలు


  ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృషూ్ణడు


  విజయవాడ, సూర్యబ్యూరో : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు న్నర సంవత్సరాలుగా అవిశ్రాంతంగా చైనా, జపాన్‌, సింగపూర్‌ తదితర దేశా లలో పర్యటించి రాష్ర్టంలో పెటుబడులను ఆహ్వానించేందుకు భేటీలు నిర్వ హించారని, దాని పర్యవసానమే నేడు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీ లు పెటుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. నగరంలోని గేట్‌వే హోటల్లో బుధవారం చైనాకు చెందిన సిచువాన్‌ ప్రోవెన్సియల్‌ పీపుల్‌‌స గవర్నమెంట్‌ సంస్థ ప్రతినిధులతో కలసి రాష్ర్టంలో పెట్టుబడులకు అవకాశం గల రంగాల గురించి వివరించారు. అనంతరం వారిని ఉద్దేశించి మంత్రి యనమల రామకషూ్ణడు మాట్లాడుతూ భారతదేశానికి తూర్పు తీరంలో 974 కిలోమీటర్ల తీర రేఖ వున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టం పెటుబడులకు అనుకూలమైన ప్రాంతమన్నారు. రాష్ర్టంలో 24 గంటలు, 365 రోజులపాటు నిరంతరాయంగా విద్యుతును అందిస్తున్నా మని తెలిపారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఈజీ ఆఫ్‌ డూయింగ్‌లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.


   కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పౌరులకు అన్ని వసతులు ఆన్‌లైన్‌లో కల్పిస్తున్నామన్నారు. ఎన్నో యేళ్ళ నుంచి భారతదేశానికి, చైనాకి అవినాభావ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని పాలించిన శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం విశ్వవ్యాప్తమైందని, ఈ ప్రాంతం నుంచి అనేకమంది బౌద్దమత గురు వులు చైనా, జపాన్‌ లాంటి దేశాలకు వెళ్లారన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. చైనాకు చెందిన సిచువాన్‌ లాంటి రాష్ట్రాలతో పెట్టుబడులకు గల అవకాశాలను చర్చించడం అభివద్ధికి నాంది పలుకుతుందన్నారు. 


   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్‌ను దష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని ప్రగతి పధంలో పయనింప జేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో అవగాహానతో ముందుకు వెళు తున్నా రన్నారు. రాష్ర్టంలో ఇప్పటికే ఆరు ఎయిర్‌పోర్టులు పనిచేస్తున్నా యన్నారు. మాన్యూపాక్చరింగ్‌ రంగంలో, పోర్‌‌టబేస్‌డ్‌ అభివృద్ధి వ్యవసాయ సంబంధమైన రంగంలో పెటుబడులు పెట్టేందుకు అవకాశాలు మెరుగా వున్నాయని, కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్‌ వల్ల పెటుబడులకు అవకాశాలు ఏర్పడు తున్నాయన్నారు. 2016-17 లో 10.99 శాతం అభివృద్ధితో రాష్ర్టం ఉందని, ప్రస్తుత సంవత్సరం 12.32 శాతం అభివృద్ధి లక్ష్యంగా నిర్దేశం చేసు కున్నట్లు తెలిపారు. అనంతరం సిచువాన్‌ ప్రోవెషియల్‌ ప్రతినిధులతో మంత్రి యనమల రామ కృష్ణుడు ఎక్‌‌సప్రెషన్‌ ఆఫ్‌ ఇం్టస్‌‌‌రట (ఈ.వో.ఐ)కి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు మార్పిడి చేసుకోవడం జరిగింది.     ఇంధనశాఖ ముఖ్య కార్య దర్శి అజయ్‌జైన్‌ మాట్లాడుతూ రాష్ర్టంలో పెటుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి 21 రోజులలోనే పరిశ్రమలకు సంబంధించి అన్ని అనుమతులు సింగిల్‌ డెస్‌‌క విధానంలో ఇస్తున్నామని తెలిపారు.


   హైదరాబాద్‌ 10 సంవ త్సరాలు ఉమ్మడి రాజధానిగా వున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు దలతో అమరావతి నిర్మాణాన్ని రెండున్నరేళ్ల కాలంలోనే సాకారం చేశారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సింగ పూర్‌ దేశానికి చెందిన కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌లు అందించాయన్నారు. అమరా వతిని అంతర్జాతీయ నగరాలతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 


    ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ డెవలెప్‌మెంట్‌ బోరు సి.ఈ.వో కృష్ణకిషోర్‌ మాట్లాడుతూ సిచువాన్‌, ఆంధ్రప్రదేశ్‌లకు అనేక విషయాలలో సారూప్యాలు కలిగి వున్నాయన్నారు. వ్యవసాయ రంగం ఆధార పరిశ్రమలు, ల్యాండ్‌ బ్యాంక్‌ ఆధికంగా కలిగి వుండ టం తదితరమైనవని తెలిపారు. సిచువాన్‌ ఇన్వెస్‌‌టమెంట్‌ ప్రమోషన్‌ బ్యూరో, డైరెక్టర్‌ జనరల్‌ చెన్‌ గున్‌గోవ్‌ మాట్లాడుతూ సిచువాన్‌ ప్రావెన్‌‌సలో ల్యాండ్గ బ్యాంక్‌ అధికంగా వుందని తెలిపారు. సిచువాన్‌ వైస్‌ గవర్నర్‌ లీజి మాట్లాడుతూ భారతదేశానికి, చైనాకి వున్న సారుప్యాల గురించి వివరించారు. రెండు దేశాల మధ్య సహాకారంతో అభివద్ధికి బాటలు వేయవచ్చన్నారు. ఈ సమావేశం రెండు దేశాల అభివద్ధికి తోడ్పడు తుంద న్నారు. 500 చైనా కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాయన్నారు. 


  సిస్టర్‌ స్టేట్‌ రిలేషన్‌‌సను స్వాగతిస్తున్నామని తెలిపారు. మాలక్ష్మీ గ్రూప్‌ పారిశ్రామికవేత్త హారిశ్చంద్రప్రసాద్‌ మాట్లాడుతూ భారతదేశ జీడిపికి ఆంధ్రప్రదేశ్‌ పొటెన్షియాలిటి ఒక శాతం వరకు అందిస్తుందన్నారు. ఆంధ్ర ƒప్రదేశ్‌లో అభివద్ధి శరవేగంగా జరుగుతుందని, దానిని పెటుబడుదారులు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈవోఐలో సిచువాన్‌ ప్రొవెన్షి యల్‌ పీపూల్‌‌స గవర్నమెంట్‌కు సంబంధించి వివిధ రంగాల డైరెక్టర్‌ జనరల్‌‌స, బిజినెస్‌ డెలిగేషన్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com