రైతులకు గుడ్ న్యూస్.. మీ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉందా.. అయితే ఇక్రిశాట్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీ పంటలకు సోకిన చీడ పురుగులు, తెగుళ్ల నివారణ, పోషక లోపాలకు సమాచారం అందుతున్నది. పంటకు కావాల్సిన పోషకాల సమాచారాన్ని వెంటనే తెలుసుకుని మంచి దిగుబడి సాధించడానికి సహకరిస్తున్నది. రైతన్నలు సాగు చేసిన బెండ, కాకర, మిర్చి, దొండ, ఆలు, క్యాబేజీ, క్యాప్సికం, కాలీఫ్లవర్ తదితర కూరగాయ పంటలు, వరి, గోధుమ, రాగులు, మక్కజొన్న వంటి ధాన్యం పంటలు, శనగ, కంది, పెసర పప్పు దినుసుల పంటల సాగు విధానం, వాటికి సోకిన తెగుళ్లును నివారించడానికి సరైన సమాచారం ప్లాంటిక్స్ యాప్ ద్వారా అందుతున్నది.
వాతావరణ పరిస్థితులు, గాలిలో తేమ, వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం వంటి విషయాలను తెలుసుకునేందుకు ఈ యాప్లో ఆప్షన్లు పొందుపరిచారు. మొబైల్ జీపీఎస్ ఆప్షన్ ఆన్ చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వాతావరణ సూచనలతో రైతులు ముందస్తుంగా తమ పంటలను ఏ విధంగా రక్షించుకోవచ్చో తెలుస్తున్నది. ఉష్ణోగ్రతలతో సాగు చేసుకునే విధానం తెలుసుకుని తమ పంటలను రైతులు రక్షించుకునే వీలు ఉంది.
రైతులారా మీ పంట సాగుకు సంబంధించి ఏమైనా సమస్యలున్నాయా. మీ పంట సాగుకు సంబంధించి ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కారం పొందవచ్చు. కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ పంటను ఫోటో తీయండి. వెంటనే పంటకున్న వ్యాధి పేరు చూపబడుతుంది. ఆ తర్వాత దానికి మందులను కూడా చూపబడుతుంది. ఇదంతా మీరు ఉన్న ప్రదేశం నుంచే చేసి పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్ లోడ్ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు. https://app.adjust.net.in/6ramofe
![]() |
![]() |