ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్వ్యూ పాసైతే చాలు రూ.35 వేల జీతంతో ఉద్యోగం..!

national |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 12:31 PM

చత్తీస్‌గఢ్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌ (సీఐఎంఎఫ్‌ఆర్‌) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి వాక్ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. వివరాలు ఇవే..


భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు: 68


-ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు: 38


-ప్రాజెక్ట్‌ అసోసియేట్లు: 30


ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు అర్హత:


-65 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ/ బీఎస్సీ (ఆనర్స్‌) ఉత్తీర్ణత.


-జీతభత్యాలు: నెలకి రూ.20,000 చెల్లిస్తారు.


ప్రాజెక్ట్‌ అసోసియేట్లు అర్హత:


-కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


-జీతభత్యాలు: నెలకి రూ.28000, గేట్‌/ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ అభ్యర్థులకు నెలకి రూ.35000 చెల్లిస్తారు.


*ఎంపిక విధానం: వాక్ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా


వాక్ఇన్‌ తేదీలు: 2022, ఫిబ్రవరి 16-24.


ఇంటర్వ్యూ జరిగే అడ్రస్:


CSIRCentral Institute of Mining and Fuel Research, Bilaspur Research Centre Campus, post- Kholi Chowk, Bilaspur, Chhattisgarh.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com