ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా త‌గ్గిన ఐఫోన్ మోడ‌ల్స్ ధ‌ర‌లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 13, 2017, 02:46 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ నిన్న‌నే త‌న నూత‌న ఐఫోన్ మోడ‌ల్స్ అయిన ఐఫోన్ 10 (X), ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌ల‌ను విడుద‌ల చేయ‌గా ఎప్ప‌టిలాగే పాత ఐఫోన్ మోడ‌ల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. కొత్త ఐఫోన్లు రిలీజ్ అయిన‌ప్పుడు పాత ఐఫోన్ మోడల్స్ ధ‌ర‌ల‌ను యాపిల్ త‌గ్గిస్తూ వ‌చ్చింది. అందులో భాగంగానే ఐఫోన్ 6ఎస్‌, 6ఎస్ ప్ల‌స్‌, 7, 7 ప్ల‌స్ ఫోన్ల ధ‌ర‌ల‌ను యాపిల్ ప్ర‌స్తుతం త‌గ్గించింది. స‌వ‌రించిన ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 


ఐఫోన్ 6ఎస్ (32 జీబీ) - పాత ధర రూ.46,900 - కొత్త ధ‌ర రూ.40వేలు - త‌గ్గింపు రూ.6,900
ఐఫోన్ 6ఎస్ (128 జీబీ) - పాత ధ‌ర రూ.55,900 - కొత్త ధ‌ర రూ.49వేలు - త‌గ్గింపు రూ.6,900
ఐఫోన్ 6ఎస్ ప్ల‌స్ (32 జీబీ) - పాత ధ‌ర రూ.56,100 - కొత్త ధ‌ర రూ.49వేలు - త‌గ్గింపు రూ.7,100
ఐఫోన్ 6ఎస్ ప్ల‌స్ (128 జీబీ) - పాత ధ‌ర రూ.65వేలు - కొత్త ధ‌ర రూ.58వేలు - త‌గ్గింపు రూ.7వేలు
ఐఫోన్ 7 (32 జీబీ) - పాత ధ‌ర రూ.56,200 - కొత్త ధ‌ర రూ.49వేలు - త‌గ్గింపు రూ.7,200
ఐఫోన్ 7 (128 జీబీ) - పాత ధ‌ర రూ.65,200 - కొత్త ధ‌ర రూ.58వేలు - త‌గ్గింపు రూ.7,200
ఐఫోన్ 7 ప్ల‌స్ (32 జీబీ) - పాత ధ‌ర రూ.67,300 - కొత్త ధ‌ర రూ.59వేలు - త‌గ్గింపు రూ.8,300
ఐఫోన్ 7 ప్ల‌స్ (128 జీబీ) - పాత ధ‌ర రూ.76,200 - కొత్త ధ‌ర రూ.68వేలు - తగ్గింపు రూ.8,200






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com