ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటుహక్కు కావాలంటే ఇక ఆధార్ తప్పనిసరి

national |  Suryaa Desk  | Published : Mon, Dec 20, 2021, 04:06 PM

ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానికి సంబంధించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. నకిలీ ఓట్ల సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనితో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టనుంది.ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్​ను కోరనుంది ఎన్నికల కమిషన్​. దీనితో పాటు ఇప్పటికే ఓటు హక్కు ఉన్న వారి నుంచి కూడా ఆధార్​ సేకరించేందుకు వీలుపడనుంది. అయితే వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నారు. బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకే ఈ బిల్లు ఆమోదించామని కేంద్రం తెలిపింది.


అర్హులందరికి ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో మరో కీలక అంశం కూడా ఈ బిల్లులో చేర్చింది కేంద్రం. దీని ప్రకారం ఏడాదికి నాలుగు సార్లు ఓటు హక్కు నమోదు చేసుకునే వీలు కలగనుంది. ప్రస్తుతం ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తోంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు కోసం ఏడాదికి నాలుగు అవకాశాలు లభించనున్నాయి. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ ప్రాతిపదికన అప్లై చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com