ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫీసులోనే మహిళా ఉద్యోగులతో అధికారి రాసలీలలు..

national |  Suryaa Desk  | Published : Tue, Nov 30, 2021, 02:35 PM

ఆయనకు 40 సంవత్సరాలకు పైగా వయస్సు ఉంటుంది. బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి. భార్య పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన ఆయనకు వక్రబుద్ది పుట్టింది. కింది స్థాయి మహిళలను తన అధికారంతో వంచించుకొని ఆఫీసులోనే వెకిలి చేష్టాలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ కావడంతో రాసలీలల రత్నాకర్ బండారం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో రత్నాకర్ అనే వ్యక్తి నోడల్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. జిల్లా స్థాయి వైద్యాధికారి అతను. తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని మహిళా ఉద్యోగులను బెదిరించేవాడు. తనకు లొంగకపోతే వేధించేవాడు. తన వేధింపులు భరించలేక కొంత మంది అతనికి లొంగిపోయారు. దీంతో రెచ్చిపోయిన రత్నాకర్ ఏకంగా కార్యాలయంలోనే వారితో వెకిలి చేష్టలు చేసేవాడు. ఇటీవల ఇద్దరు మహిళలను తన కాళ్లపై కూర్చొని ఫోటోలు దిగాడు. ఇవి సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ప్రబుద్దుని పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com