ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబు రాక్షస పాలనపై పోరాడండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 11:19 PM

 -మహిళలకు రోజా పిలుపు


 -మహిళా సదస్సు సాక్షిగా అవమానం


 -మహిళా సాధికారతను సీఎం చంద్రబాబు కిట్టీ పార్టీలా మార్చేశారు


 -చంద్రబాబు పాలన హిట్లర్‌ను తలపిస్తోంది


విజయవాడ, మేజర్‌న్యూస్‌: చంద్రబాబు రాక్షస పాలనపై పోరాటం చేయాలని మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. మహిళా సదస్సును మహానాడులా నిర్వహించారని విమర్శించారు. మహిళా సాధికారతను సీఎం చంద్రబాబు కిట్టీ పార్టీలా మార్చేశారని మండిపడ్డారు. మంగళవారం ఉదయం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళా సదస్సు జరిగిన తీరును జాతీయ మీడియా ఏకిపారేసిందని చెప్పారు. భజనపరులనే సదస్సును అనుమతించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన హిట్లర్‌ ను తలపిస్తోందని వాపోయారు. మహిళా సదస్సుకు తనను ఆహ్వానించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగి అవమానంపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. పోలీసులను చంద్రబాబు బౌన్సర్లుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మమ్మల్ని అణగతొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. మహిళా సదస్సు సాక్షిగా తనకు అవమానం జరిగిందన్నారు. స్పీకర్‌ పంపిన ఆహ్వానం మేరకు సదస్సుకు వచ్చిన నన్ను అక్రమంగా నిర్బంధించారని ఆక్షేపించారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నిర్బంధించిన తీరును చూసి దేశం నివ్వెరపోయిందన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు.   వెంకయ్య కూతురు, కేసీఆర్‌ కూతురు, చంద్రబాబు కోడలు వీళ్లకే ప్రాధాన్యత ఇస్తారా అని ప్రశ్నించారు. కార్పొరేట్‌ మహిళా సదస్సా, కామన్‌ మహిళా సదస్సా అని నిలదీశారు. స్పీకర్‌ రెండు ఇన్విటేషన్లు పంపితేనే వచ్చానని ఆమె తెలిపారు. మహిళా సమస్యలపై మాట్లాడే హక్కు నాకు లేదా అన్నారు. తాను ఈ రాష్ట్రంలో పుట్టలేదా నాకు ఇక్కడ ఇళ్లు లేవా అన్నారు. మీకు నచ్చకపోతే వేరే రాష్ట్రంలో వదిలేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ ఉండే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. డీజీపీ కనుసన్నల్లో ఇలాంటి దారుణం జరగ డం బాధాకర మన్నారు. చట్టప్రకారం నడుచుకోవాల్సిన డీజీపీ ఇలా చేయడం బాధాకరమని పేర్కొన్నారు. చంద్ర బాబుకు బానిసలా డీజీపీ పనిచేయడం దురదృష్టకరమని చెప్పారు. డీజీపీ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజల దృష్టిలో విలన్‌గా ఉండిపోయే అవకాశ ముందన్నారు. కుంటిసాకులతో నన్ను నిర్బంధించిన విధానం చాలా తప్పు అని పేర్కొన్నారు. తన ట్రాక్‌ రికార్డు చూసి నిర్బంధించమని చెప్పానని చంద్రబాబు అంటున్నారని, పదేళ్లు టీడీపీలో ఉన్నప్పుడు ట్రాక్‌ రికార్డు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. ఏదైనా ప్రభుత్వాలు కూల్చిన ట్రాక్‌ రికార్డు ఉందా అన్నారు. నా ఇంట్లో బాంబులు పేలిన ట్రాక్‌ రికార్డు ఉందా అని ప్రశ్నించారు. ఇంట్లో వారిపై కాల్పులు జరిపిన ట్రాక్‌ రికార్డు ఉందా అని అన్నారు. ఏ ట్రాక్‌ రికార్డు చూసి నన్ను నిర్బంధించమని డీజీపీకి చెప్పారని ఆమె ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానాలపై న్యాయం పోరాటం చేయాలని నిర్ణయించుకోన్నానని చెప్పారు. తమకు జరిగిన అన్యాయాలపై సామాన్య మహిళలు తిరబడాలన్నఉద్దేశంతో న్యాయపోరాటానికి సిద్ధపడ్డానన్నారు.  బాబు హయాంలో 11 శాతం నేరాలు పెరిగాయని పోలీసు రికార్డులే చెబుతున్నాయన్నారు. చంద్రబాబు, డీజీపీ ఉన్న విజయ వాడలోనే 70 రేప్‌ లు జరిగాయని తెలిపారు. కర్నూలులో మహిళపై టీడీపీ నేతలు గ్యాంగ్‌ రేప్‌ చేస్తే డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధిత మహిళ డీజీపీ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించు కోలేదన్నారు. మహిళా సమస్యలపై పోరాటం చేయకపోతే ఎమ్మెల్యేగా తాను ఉండడమే వేస్‌‌ట అని ఆమె చెప్పారు. మహిళల కోసం అడుగడు గునా పోరాటం చేయడం వల్లే తనపై కక్ష సాధిస్తున్నారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com