ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షరతులతో ర్యాలీకి హైకోర్టు అనుమతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 11:17 PM

 -పిటిషన్‌ వాపసు తీసుకున్న జెఏసీ


 -సభకు అనుమతి లేదు: డీజీపీ


 -హైదరాబాద్‌కు అదనపు పోలీస్‌ బలగాలు


హైదరాబాద్‌, (న్యూస్‌నెట్‌వర్‌‌క): నిరుద్యోగ ర్యాలీకి అనుమతి పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం నాడు  విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ర్యాలీకి అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని... అయితే ర్యాలీని మంగళవారం నాడు  కాకుండా ఆదివారం నిర్వహించుకోవాలని కోర్టు ఐకాసకు సూచించింది. నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది. నాగోల్‌లోని మెట్రో గ్రౌండ్‌లో తెలంగాణ జేఏసీ నిరుద్యోగుల నిరసన సభను నిర్వహించు కోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే, తాము నిరుద్యోగుల నిరసన సభ నిర్వహించేదే మొత్తం తెలంగాణ సమాజానికి తెలియాలని, అందుకే హైదరాబాద్‌ నడిబొడ్డున సభ నిర్వహించాలనుకుంటే తమకు శివారు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ జేఏసీ తమ పిటిషన్‌ను వెనక్కి ఉపసంహకరించుకుంది.తాము మాత్రం నాగోల్‌ మెట్రో గ్రౌండ్‌లో సభను నిర్వహించబోమని టీ జేఏసీ చెబుతోంది.  సభ నిర్వహణ కోసం హైకోర్టులో జరిగిన వాదోపవాదాలను టీజేఏసీ తరుపు న్యాయవాదులు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని అన్నారు. దీనిపై విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా నగరంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించే ప్రమాదం ఉందని.. అందువల్ల నగర శివారుల్లో తాము సూచించిన ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించుకోవాలని హైదరాబాద్‌ పోలీసులు సూచించారు. ఈ ర్యాలీకి భారీ ఎత్తున జన సమీకరణ జరిగిందని.. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం తమిళనాడులో జల్లికట్టు తరహాలో జనాన్ని సమీకరిస్తు న్నట్లు తెలుస్తోందని పోలీసులకు హైకోర్టు నివేదించారు. శాంతిభద్రతల దృష్టా్య నగరంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ర్యాలీ అనుమతి కోసం  డీజీపీని కలిసి వెళ్తున్న జేఏసీ నేతలకు ఆర్టీసీ చౌరస్తాలో పోలీసులు నోటీ„ సులు అందజేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని పోలీసులకు తెలి పామని జేఏసీ నేతలు అన్నారు. అయినా తమ ర్యాలీకి అనుమతి ఇవ్వక పోవడంపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. నిరుద్యోగుల హక్కులను పోలీసు లు కాలరాస్తున్నారని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


సభకు అనుమతి లేదు: డీజీపీ : జేఏసీ సభకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు. జిల్లాల నుంచి ఎవరూ రావొద్దని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు.  సభలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని డీజీపీ తెలిపారు. ఇంటెలిజెన్‌‌స సమాచారం ఉన్నందునే సభకు అనుమతి నిరాకరించామని డీజీపీ అన్నారు. సభకు వేలాదిమంది వస్తారని సమాచారం ఉందని డీజీపీ అనురాగ్‌శర్మ చెప్పారు. విద్యార్థులను పంపొద్దని తల్లిదండ్రులకు డీజీపీ సూచించారు.


నగరానికి భారీ బలగాలు : హైదరాబాద్‌కు అదనపు పోలీస్‌ బలగాలను  ప్రభుత్వం రప్పించింది. సుందరయ్య విజ్ఞానకేంద్రం, ఇందిరాపార్కు, ఓయూ పరిసరాల దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. రాత్రి నుంచి అరెస్‌‌టలు  ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగుల నిరసన ర్యాలీలను దృష్టిలో పెట్టుకొని బలగాలను తెప్పించినట్లు సమాచారం అందింది. అనుమతి లేకుండా నిర్వహించే ర్యాలీలను అదుపు చేసే ఉద్దేశంతో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిరసన కార్యక్రమాల్లో హింస జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిది.


 ర్యాలీకి వస్తే భవిష్యత్తు ఉండదు: డీసీపీ :  నగరంలో బుధవారం నాడు తెలంగాణ జేఏసీ నిర్వహించాలని తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. అనుమతి లేని ర్యాలీలలో ఎవరూ పాల్గొనవద్దని ఆయన చెప్పారు. ఈ ర్యాలీలలో పాల్గొంటే నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. అలాంటి ర్యాలీలో పాల్గొన్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com