ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా మిలాద్-ఉన్-నభి ప్రత్యేక ప్రార్థనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 19, 2021, 03:09 PM

కృష్ణాజిల్లా  : ఘనంగా మిలాద్-ఉన్-నభి ప్రత్యేక ప్రార్థనలు. తిరువూరు నియోజకవర్గంలో మిలాద్- ఉన్- నబీ  ప్రత్యేక ప్రార్థనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లిం సోదరులు.మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజును మిలాద్ ఉన్ నబీగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధనలతో జరుపుకున్నారు. తిరువూరు, విస్సన్నపేట, ఏ- కొండూరు,గంపలగూడెం మండల్లాలోని ఆయా మస్జీద్ లలో ఇస్లాం మత గురువులు ప్రసంగిస్తు. విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లిముల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని వివరించారు. జామియా మస్జీద్ ఇస్లాం మతగురువు రిజ్వి ఖురాన్ గ్రంథంలోని ప్రవక్త మహమ్మద్ యొక్క విశిష్టతను వారి శాంతియుత మార్గాన్ని తెలిపారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com