ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలన్ మస్క్ బ్రేకప్

international |  Suryaa Desk  | Published : Sat, Sep 25, 2021, 11:26 AM

ప్రపంచ కుబేరుల్లో ఒకడు, టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్, ఆయన గర్ల్ ఫ్రెండ్, కెనడా సింగర్ అయిన గ్రీమ్స్ విడిపోతున్నారు. సుమారు మూడు సంవత్సరాల సహజీవనం తర్వాత, ఓ కొడుకు పుట్టిన తర్వాత వారిద్దరూ ‘విడిపోతున్నారు’ అని పేజ్ సిక్స్ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం శుక్రవారం ప్రచురితమైంది. సాక్షాత్తూ ఎలన్ మస్క్ ఈ విషయాన్ని చెప్పినట్టు పేజ్ సిక్స్ తన కథనంలో పేర్కొంది. ‘మేం 2018 మే నెల నుంచి మేం ఇద్దరం కలిసి డేటింగ్ చేశాం. ఇప్పటికీ మా ఇద్దరికీ సత్సంబంధాలే ఉన్నాయి. మేం ఇద్దరం కలసి మా ఏడాది కొడుకుని పెంచుతున్నాం.’ అని ఎలన్ మస్క్ చెప్పినట్టు తెలిపింది. ఇప్పుడు తామిద్దరం పాక్షికంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఎలన్ మస్క్ చెప్పినట్టు తెలిపింది. ‘మేం పాక్షికంగా విడిపోయాం. కానీ ఇంకా ఒకరిని మరొకరు ప్రేమిస్తున్నాం. ఇప్పటికీ కలుస్తున్నాం. మా ఇద్దరికీ సత్సంబంధాలే ఉన్నాయి.’ అని ఎలన్ మస్క్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com