ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వీడియోతో జాబ్ కు గుడ్‌బై..కానిస్టేబుల్ కు షాక్

national |  Suryaa Desk  | Published : Thu, Sep 16, 2021, 12:20 PM

ఆమె ఒక పోలీస్ కానిస్టేబుల్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఆమెకు ఇష్టం. అంతేకాదు ఇన్‌స్టాలో రీల్స్, వీడియోలు చేసి వేలల్లో ఫాలోవర్లను సంపాదించుకుంది. కానీ ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసిన ఒక్క వీడియో ఆమె ఉద్యోగానికే ఎసరు తెచ్చి పెట్టింది. పోలీసు యూనిఫాంలో, చేతిలో రివాల్వర్‌తో ఆమె చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పై అధికారులు కూడా సీరియస్ అయ్యారు. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రి తనకొచ్చిన ఓవర్‌నైట్ క్రేజ్ ఉందన్న ధైర్యమో ఏమో తెలియదు గానీ తన కానిస్టేబుల్ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కానిస్టేబుల్‌గా పనిచేసి ఒక ఇన్‌స్టా వీడియో కారణంగా ఉద్యోగాన్ని వదులుకున్న ప్రియాంక మిశ్రా రాజీనామాను ఎట్టకేలకు ఉన్నతాధికారులు ఆమోదించారు. అంతేకాదు ఆమెకు ఊహించని షాక్ ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ తరపున ప్రియాంక మిశ్రాకు ఒక నోటీస్ కూడా పంపించారు. ఆ నోటీసులో ఏముందంటే పోలీస్ శాఖకు ప్రియాంక మిశ్రా లక్షా 82 వేలను చెల్లించాలని ఉంది. ఇందులో ఆమె ట్రైనింగ్ నిమిత్తం ఖర్చు చేసిన లక్షా 52 వేలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రియాంక మిశ్రా రాజీనామా వాలంటరీ రిటైర్మెంట్ పరిధిలోకి రాదని ఎస్‌ఎస్‌పీ మునిరాజ్ తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేస్తే ట్రైనింగ్ నిమిత్తం ఖర్చు చేసిన మొత్తాన్ని ఉద్యోగి నుంచి ఛార్జ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com