ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల్లో ఈ సమస్యలకు ఇలా చెక్..!

national |  Suryaa Desk  | Published : Thu, Sep 09, 2021, 12:40 PM

మహిళలకు మెనోపాజ్ దశలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. బరువు పెరగడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, చర్మం పొడిబారడం, మొటిమలు ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. దీంతో ఆడవాళ్లు అందంపై కూడా ఈ ప్రభావం పడుతుంది. అయితే ఇదంతా హార్మోన్ల అసమతుల్యత వల్లే జరుగుతుంది. అయితే చక్కటి స్కిన్‌ కేర్‌ రొటీన్‌ పాటిస్తే సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.


పాడైపోయిన చర్మ కణాల్ని రిపేర్‌ చేయడం, కొత్త కణాల్ని ఉత్పత్తి చేయడం కొలాజెన్‌ పని. అలాంటి ప్రొటీన్‌ పనితీరు మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళల్లో తగ్గిపోతుంటుంది. తద్వారా చర్మం సాగిపోవడం, ముడతలు, గీతలు రావడం.. వంటి వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందుకే కొలాజెన్‌ పని తీరును పెంచుకోవడానికి ఏ, సీ విటమిన్లతో తయారైన సీరమ్, క్రీమ్స్‌ నిపుణుల సలహా మేరకు వాడడంతో పాటు ఈ విటమిన్లు అధికంగా లభించే ఆహారాన్ని కూడా రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి.


మెనోపాజ్‌ దశలో ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గిపోయి, పురుష హార్మోన్లైన ఆండ్రోజెన్‌ స్థాయులు పెరగడం వల్ల అవాంఛిత రోమాల సమస్య అధికమవుతుంది. ఈ క్రమంలో గడ్డం, పైపెదవిపై అవాంఛిత రోమాలు వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చక్కెరలు, కార్బోహైడ్రేట్లుండే ఆహారానికి దూరంగా ఉండడం, బరువును అదుపులో ఉంచుకోవాలి.


వాతావరణంలోని దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలు చర్మంలోకి చేరి బ్లాక్‌హెడ్స్‌, మొటిమలు, మచ్చలు.. వంటి సౌందర్య సమస్యలకు కారణమవుతాయి. దీనికి మెనోపాజ్‌ దశ, వయసు పెరగడం.. వంటి అంశాలతో సంబంధం ఉండదు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి స్కిన్‌ ఎక్స్‌ఫోలియేషన్‌ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో చర్మాన్ని స్క్రబ్‌ చేస్తూ బ్లాక్‌హెడ్స్‌, జిడ్డుదనం, చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించుకోవాల్సి ఉంటుంది.


ఇక వీటితో పాటు బయటికి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, కంటి నిండా నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివి తప్పనిసరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com