ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరులో స్టీల్‌ప్లాంట్‌.. ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 15, 2021, 03:37 PM

నెల్లూరు జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మినపట్నం-మోమిడి పరిధిలో రూ.7,500 కోట్లతో 11.6 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. గతంలో కిన్నెటా పవర్‌ కు ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసి వాటిని జిందాల్‌ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు జిందాల్‌ కు 860 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ తో 2,500 మందికి ప్రత్యక్షంగా.. 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్లాంట్‌ విస్తరణకు వచ్చే 4 ఏళ్లలో 3 వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com