న్యూఢిల్లీ: 14 వ భారత రాష్ట్రపతిగా బీహార్ మాజీ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 కు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. కోవింద్ తో జస్టిస్ ఖేహర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.