ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఓటు అమ్ముకుంటున్నారా.. ఒక్కసారి ఆలోచించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 05, 2021, 03:25 PM

ఓటు ప్రతి ఒక్కరి సామాన్యుని హక్కు. మీ ఓటుతోనే ఒక సామాన్యుడిని కూడా శక్తివంతుడు చేస్తుంది. దేశ తలరాతను మార్చేస్తుంది. మమ్మల్ని చక్కగా పాలించి మాకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఒక నాయకుడిని ఎన్నుకోవడమే కాదు.. మీ గ్రామాన్ని, మీ ఊరిని అభివృద్ధి పరిచి అందరికీ అండగా ఉంటాడని భావించి ఒక ఓటరు తన అభ్యర్థిని ఎంచుకుంటాడు.
ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాల్లో ఆసక్తికరమైన రాజకీయం మొదలైంది. ఏ పార్టీ అభ్యర్థి అయిన ఓటర్ ని ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలుగా కాకా పడుతున్నారు. ప్రస్తుతం గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సర్పంచులు తమ ఊరిలో ఓటుకు ఎంత డబ్బు పంచాలో, మద్యం ఎంత పంచాలో ఆలోచనలకు పదును పెడుతూ ఉంటారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభ్యర్థి ఓటుకు ఎంత ఇస్తే అంత తీసుకుని తమకు నచ్చిన వ్యక్తిని ఓటు వేస్తూ వుంటారు. చాలామంది మరి ఓటును అమ్ముకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టాలు జరుగుతాయో మీరే గ్రహించాలి. ఓటు అమ్ముకోవడం వల్ల నష్టమే తప్ప ఎటువంటి లాభం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మీ ఓటును రూ.500 నుంచి 5 వేల వరకు డబ్బుపెట్టి కొనీ గెలిచేందుకు అభ్యర్థి వెనుకాడడు. డబ్బు పంచి గెలిచిన అభ్యర్థి నీకు ఎంత వరకు సేవ చేస్తాడన్నది గుర్తించాల్సిన విషయం.
గ్రామంలో ఓటుకు డబ్బులు వచ్చిన తర్వాత గెలిచిన అభ్యర్థి తన డబ్బును తిరిగి ఎలా రాపట్టుకోవాలో అని ఆలోచిస్తూనే ఉంటాడు. ప్రభుత్వం పంపించిన నిధులను ఎలా స్వాహా చేయాలి, గ్రామంలో చేస్తున్న అభివృద్ధి పనులలో ఎంత మేరకు కమిషన్ తీసుకోవాలని ఆలోచిస్తాడే తప్ప మా గ్రామానికి మంచి జరుగుతుందనే ఆలోచనలో ఏమాత్రం ఉండదని ప్రతి ఒక్కరూ ఇక్కడ గ్రహించాల్సిన విషయం.
అంతేకాకుండా గ్రామంలో జరుగుతున్న పనులన్ని నాసిరకంగా చేయటం వల్ల గ్రామంలో చేపట్టిన అభివృద్ధి నిర్మాణాలు కొద్ది రోజులకే కుప్పకూలే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. గ్రామంలో నీటి నుంచి ప్రారంభమయ్యే సమస్యలు ఎన్నో సమస్యలు ఉంటాయి. గెలిచిన అభ్యర్థిని గట్టిగా నిలదీసే అవకాశమే ఉండదు. ఎందుకంటే నేను మీకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్నాను కాబట్టి నన్ను ప్రశ్నించే హక్కు లేదు అనే అవకాశం కూడా ఉంది. గెలిచిన అభ్యర్థి అంతే కాదు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కన్నా తన సంపాదన పెంచుకునే ఆలోచనలోనే గెలిచిన అభ్యర్థి ఉంటాడు.
కాబట్టి ప్రజలు ఆలోచించండి డబ్బు తీసుకొని ఓటును అమ్ముకోపోవడం వల్ల కలిగే నష్టాలు ఒక్కసారి ఆలోచించండి. మీ గ్రామం, మీ ఊరు అభివృద్ధి చెందాలంటే డబ్బు తీసుకోకుండా ఓటు వేయండి. మీ గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చే వారిని ఎన్నుకోండి. డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని అంగీకార పత్రం రాయించుకొని ఓటు వేయండి. ఓటుకు డబ్బులు తీసుకోకుండా అభ్యర్థిని ఎన్నుకోండి మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com