కరోనా వైరస్ లో నాలుగు వేల రకాలు ఉన్నాయని, అవన్నీ కరోనా కేసుల్ని పెంచేస్తున్నాయని బ్రిటన్ మంత్రి మంత్రి నదీమ్ జహావీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్ ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి నదీమ్ జహావీ అన్నారు. జన్యుక్రమ నమోదు పరిశ్రమల్లో 50% పైగా బ్రిటన్ లో ఉన్నాయని, ఈ వైరస్ లో రకాలన్నీ లైబ్రరీల్లో భద్రపరిస్తే అవసరమైనప్పుడు అది విసిరే సవాళ్లను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ ను తయారు చేయవచ్చునని మంత్రి నదీమ్ జహావీ సూచించారు. ఒక వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్ డోసులను ఇచ్చి.. అవి ఎలా పని చేస్తున్నాయో అక్కడి ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంలో మిక్స్ అండ్ మ్యాచ్ తరహాలో వ్యాక్సిన్ లు ఇవ్వడం ఇదే తొలిసారి. ఇలా రెండు వేర్వేరు రకాల కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.